వార్నర్ ను దాటేసిన బిల్డప్ బాబాయ్.. ప్రపంచ రికార్డ్?
ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా తమ తమ జట్లను గెలిపించుకునేందుకు వీరోచితమైన పోరాటం చేస్తూ.. ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ సైతం అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో గతంలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ సీనియర్స్ కు రెస్పెక్ట్ ఇవ్వకుండా విమర్శల పాలు అయినా రియాన్ పరాగ్ బిల్డప్ బాబాయ్ అనే ఒక ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే అతను ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.
టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నిలో జట్టు విజయం కోసం కీలకంగా వ్యవహరిస్తున్నాడు. టి20 క్రికెట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా ఏడు అర్థ సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు రియాన్ పరాగ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇటీవల బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతను 50 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. అతని తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ మసకజ్జా, కామ్రాన్ అక్మల్, బట్లర్, డేవిడ్ వార్నర్, కాన్వె లు ఐదు హాఫ్ సెంచరీలతో ఉన్నారు. ఇలా ఏకంగా క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న వారి రికార్డులను సైతం బ్రేక్ చేయడంతో అతని అభిమానులందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.