క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. హైదరాబాదులో మ్యాచ్ కష్టమే?
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతుండగా.. చివరి మ్యాచ్ డిసెంబర్ మూడవ తేదీన హైదరాబాద్ వేదికగా జరగబోతుంది. దీంతో ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అందింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ వేదికను హైదరాబాద్ నుంచి మార్చే అవకాశం ఉందట. ఎందుకంటే డిసెంబర్ మూడవ తేదీన ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీంతో మ్యాచ్ కు పూర్తిస్థాయి భద్రత కల్పించలేమని పోలీసులు స్పష్టం చేశారట.
ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిందట. అయితే బిసిసిఐ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది అయితే ఒకవేళ హైదరాబాద్లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం లేకపోతే మ్యాచ్ వేదికను హైదరాబాద్ నుంచి మరో చోటికి మార్చే అవకాశం ఉంది. ఇది నిజంగా హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత.. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన.. ఇక ఇప్పుడు అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అందింది.