ముంబై కాలుష్యంపై.. రోహిత్ శర్మ ఆందోళన?
అయితే అచ్చం ఢిల్లీలో ఎలా అయితే కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందో ఇక భారతదేశ వాణిజ్య నగరంగా పిలుచుకునే ముంబైలో కూడా ఇలాగే కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో అచ్చం ఢిల్లీ లాంటి పరిస్థితిలే ముంబైలో కూడా నెలకొంటున్నాయి. అక్కడ కాలుష్యం కారణంగా ఎప్పటికి ప్రాంతాలు మొత్తం పొగ మంచుతో నిండిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ముంబైలో నెలకొన్న వాయువు కాలుష్యం గురించి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు టీమిండియా అటు శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ కి ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ.. ముంబై కాలుష్యం గురించి ఆవేదన వ్యక్తం చేసాడు. భవిష్యత్తు తరాలకు ఈ పరిస్థితి సరైనది కాదు అంటూ పేర్కొన్నాడు. మన ముందు తరాలు ఎటువంటి భయం లేకుండా జీవించడం ముఖ్యం. నేను క్రికెట్ కాకుండా వేరేది మాట్లాడాలి అంటే ఈ ముంబై కాలుష్యం విషయాన్ని ప్రస్తావిస్తాను. మనం వాతావరణం పై జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రోహిత్ కామెంట్ చేశాడు. కాగా ముంబైలో పెరిగిపోయిన కాలుష్యంపై ఇటీవల బాంబే హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.