ఐసీసీ బెస్ట్ ఫీల్డర్ ర్యాంకింగ్స్.. చివరి స్థానంలో కోహ్లీ?
అయితే ఈ ర్యాంకింగ్స్ లో అటు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు అన్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారు. కానీ ఇప్పుడు అదే విరాట్ కోహ్లీ ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఫీల్డర్ ర్యాంకింగ్స్ లో చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరోసారి వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్న ప్లేయర్స్ కు.. రేటింగ్ పాయింట్లును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ లిస్టులో న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ శాంట్నర్ 43.28 పాయింట్లు ఫస్ట్ ర్యాంక్ లో నిలిచాడు. ఈ వరల్డ్ కప్ లో అతను అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొడుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఫీల్డర్ల జాబితాలో ఇక మిచెల్ శాంట్నర్ తర్వాత మిల్లర్ 41.19 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 35. 82 పాయింటులతో ఉన్నాడు. ఇక ఆ తర్వాత లివింగ్ స్టోన్ 34.77 పాయింట్లు, టీమిండియా ఆల్ రౌండ్ రవీంద్ర జడిజ 33.72 పాయింట్లు, ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 33.46 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా గత ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన కోహ్లీ ఇటీవల ర్యాంకింగ్స్ లో మాత్రం చివరి స్థానంలో ఉన్నాడు.