టీం
ఇండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అరుదైన ఘనతని సాధించాడు. 2023 వ సంవత్సరంలో
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు.వన్డే వరల్డ్కప్ 2023లో శ్రీలంతో మ్యాచ్లో మొత్తం 92 పరుగులు చేసిన గిల్.. ఈ రికార్డును తన పేరిట చరిత్రలో లిఖించుకున్నాడు.ఈ ఏడాదిలో ఇప్పటి దాకా 12 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు
శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఇంకా బాబర్ ఆజం పేరిట ఉండేది. వీరిద్దరూ ఇప్పటి దాకా ఏకంగా 11 సార్లు పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా మొత్తం 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88) ఇంకా శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మొత్తం ఐదు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర రాహుల్ రూపంలో ఒక వికెట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుసగా ఏడో విజయంతో అధికారికంగా సెమీ ఫైనల్ కు చేరిన ఫస్ట్ జట్టుగా టీమిండియా నిలిచింది. 302 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం అందుకుంది. 358 పరుగుల లక్ష్య ఛేదనలో 19.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన
శ్రీ లంక కేవలం 55 పరుగులకి ఆలౌట్ అయ్యింది.శ్రీలంక బ్యాటర్లను మహ్మద్ సిరాజ్, మహ్మద్
షమీ లు పోటా పోటీగా వికెట్లు తీయడంతో
శ్రీలంకేయులు 55 పరుగులకే తగలబడిపోయారు.
ఇక మొదటి ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా మరో ఇద్దరు అయితే కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. నిస్సంక, కరుణరత్నె ఇంకా సమరవిక్రమ డకౌట్ అయ్యారు. కుశల్ మెండిస్, అసలంక చెరొక పరుగుతో సరిపెట్టుకున్నారు.ఈ మ్యాచ్ తో
శ్రీలంక చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఇక అంతకుముందు
టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. రెండో బాల్ కే కెప్టెన్
రోహిత్ శర్మ (4) వికెట్ కోల్పోయినా.. తర్వాత శుభమన్ గిల్ (92) ,ఇంకా కోహ్లి (88) రెండో వికెట్ కు ఏకంగా 189 పరుగులు జోడించారు.ఇక ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేస్తారనుకున్నా.. దగ్గరగా వచ్చి ఔటయ్యారు. తరువాత చివర్లో
శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82),
ఇంకా జడేజా (24 బంతుల్లో 35) చెలరేగడంతో
ఇండియా మొత్తం 8 వికెట్లకు 357 రన్స్ చేసింది.