పాపం.. టీమ్ ఇండియా ప్లేయర్లకు ఇలా జరుగుతుందేంటి?
కానీ అటు టీమ్ ఇండియా మాత్రం వరుస విజయాలు సాధిస్తుంది. అదే సమయంలో భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ భారీగా పరుగులు చేస్తున్నారు. కానీ ఆ భారీ ఇన్నింగ్స్ ని సెంచరీలుగా మలచడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక ఈ ఒక్క వరల్డ్ కప్ లోనే ఇప్పుడు వరకు టీం ఇండియా ప్లేయర్లు 8 సెంచరీలు మిస్ చేసుకున్నారు అని చెప్పాలి. దీంతో అభిమానులు ఎంతలా నిరాశలో మునిగిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తమ అభిమాన ఆటగాడు సెంచరీ వరకు చేరుకొని తప్పకుండా ఆ మార్క్ అందుకుంటాడు అనుకుంటున్న సమయంలో.. చివరికి ఏదో ఒక విధంగా అవుట్ అయితే ప్చ్ ఇలా జరిగిందేంటి అని అందరూ నిరాశ చెందుతూ ఉంటారు.
ఏకంగా విరాట్ కోహ్లీకే మూడుసార్లు సెంచరీ మిస్సైంది. 85, 95, 88 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మకు రెండుసార్లు 86, 87 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి సెంచరీని అందుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ 97 పరుగుల వద్ద ఆస్ట్రేలియాపై సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుభమన్ గిల్ 92, అయ్యర్ 82 పరుగుల వద్ద సెంచరీని అందుకోలేక పెవిలియన్ చేరారు అని చెప్పాలి. దీంతో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలోనే టీమ్ ఇండియా ప్లేయర్లు ఏకంగా 8 సెంచరీలు మిస్ చేసుకున్నారు. అయితే జట్టు విజయం విషయంలో అదృష్టం వరిస్తున్న సెంచరీల విషయంలో మాత్రం టీమ్ ఇండియా ప్లేయర్లను బ్యాడ్ లక్ వెంటాడుతుంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.