ప్చ్.. కోహ్లీ మళ్ళీ మిస్.. ఇక బర్త్ డే రోజే తీరేలా ఉంది?

praveen
టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉంటే.. ఇక జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్ లోను భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. దీంతో వన్డే ఫార్మాట్లో ఏకంగా 48 సెంచరీల రికార్డును అందుకున్నాడు.


 అయితే విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తే వన్డే ఫార్మాట్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును అధిగమించడం ఎంతో ఈజీ అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో కోహ్లీ సెంచరీలకు చేరువగా వచ్చి.. వరుసగా మిస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు మూడుసార్లు విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాడు. 85, 95, 88 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో కోహ్లీ రికార్డును సమం చేసాడు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. అయితే ఇటీవల అటు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అయినా సెంచరీ చేస్తాడు అనుకుంటే.. 88 పరుగులు చేసిన కోహ్లీ మళ్ళీ సెంచరీ మిస్ అయ్యాడు.


దీంతో మేమంతా ఆశపడుతున్న కోహ్లీ 49వ సెంచరీ కోరిక తీరేది ఎప్పుడు.. అని అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో కోహ్లీ బర్త్ డే కి ఈ ఘనత సాధించటం ఖాయం అని ఫ్యాన్స్ అందరూ కూడా బావిస్తున్నారు. ఇలా సెంచరీ చేసీ విరాట్ కోహ్లీ అభిమానులందరికీ కూడా పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని బలంగా నమ్ముతూ ఉన్నారు. కాగా నవంబర్ 5వ తేదీన సౌత్ ఆఫ్రికా తో టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది. అది కూడా కోహ్లీ హోమ్ గ్రౌండ్ ఐన ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది. దీంతో కోహ్లీ సెంచరీ చేస్తే అది ఎంతో స్పెషల్ కాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: