కోహ్లీ సెంచరీ.. రికార్డులు బద్దలు కొట్టిన హాట్ స్టార్?
ఏకంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు అన్నింటినీ కూడా మొబైల్ లో ఉచితంగా చూడవచ్చు అంటూ ఆఫర్ ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. దీంతో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా కూడా మొబైల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నారు. అయితే మిగతా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అంతంత మాత్రం గానే వ్యూయర్షిప్ వస్తున్న భారత్ ఆడుతున్న మ్యాచ్లకి మాత్రం రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ వస్తోంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో నాలుగు కోట్ల మంది ఒకే సమయంలో మ్యాచ్ వీక్షించగా వ్యూయర్షిప్ రికార్డు నమోదయింది.
అయితే ఇక ఈ నాలుగు కోట్ల వ్యూయర్షిప్ రికార్డును ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీలో బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం అని అందరూ అనుకున్నారు. ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే తప్ప ఈ రికార్డు బద్దలు కాదు అని అందరూ భావించారు. కానీ ఇటీవలే భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైం వ్యూయర్షిప్ రికార్డును సృష్టించింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసే సమయంలో ఏకంగా 4.4 కోట్ల మంది అభిమానులు మ్యాచ్ వీక్షించారు. ఇది ఆల్ టైం రికార్డ్ అని హాట్ స్టార్ ఇటీవల ప్రకటించింది.