ప్చ్.. సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు?
ఇలా భయంకరమైన ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఇటీవల సొంత గడ్డపై ఓటమి ఎరుగని జట్టుగా ప్రాస్థానాన్ని కొనసాగిస్తున్న భారత జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని భారత జట్టు విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ సౌత్ ఆఫ్రికా నుంచి భారత జట్టుకు గడ్డి పోటీ తప్పదు అన్న విషయాన్ని కూడా ఊహించారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఎలా అయితే అందరూ ప్రత్యర్థులపై టీమిండియా పైచేయి సాధించిందో సౌత్ ఆఫ్రికా అదే కొనసాగించింది. ఏకంగా సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి తమకు తిరుగులేదు అని నిరూపించింది భారత జట్టు.
ఇటీవల ఈడన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును కూడా మూట గట్టుకుంది. ఇప్పటివరకు పరుగుల పరంగా ప్రోటీస్ జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమి అని చెప్పాలి. ఇంతకుముందు 2002లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 152 పరుగులు తేడాతో ఓడిపోయింది. 2015 లో వరల్డ్ కప్ లో భారత్ చేతిలో 130 పరుగులు తేడాతో ఓడిపోయింది. కానీ ఇప్పుడు 243 పరుగుల తేడాతో ఓడిపోయి చెత్త రికార్డు నమోదు చేసింది.