మాక్స్ వెల్ ఇన్నింగ్స్ పై.. సంచలన ఆరోపణలు?
అయితే ఇటీవల ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ప్రేక్షకులు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందారు. మరీ ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ ఎంతో అలవోకగా విజయం సాధించడం ఖాయం అనే పరిస్థితి నుంచి.. ఇక ఆస్ట్రేలియా కష్టాల నుంచి బయటపడి విజయతీరాలకు చేరిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ తన వీరోచితమైన బ్యాటింగ్ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఏకంగా గాయం వేధిస్తున్న డబుల్ సెంచరీ చేశాడు.
దీంతో అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తుంటే..గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ హసన్ రజా మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. తొలి ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ బౌలర్లు బౌలింగ్ చేసేటప్పుడు బాల్ స్వింగ్ అయింది. ఆ టైంలో ఇండియా బాల్ వాడటంతో బాల్ ప్యాడ్ లకు తాకింది. వికెట్లు పడ్డాయి. అయితే 20 ఓవర్ల తర్వాత మళ్లీ నార్మల్ బాల్ తెచ్చి ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే గతంలో కూడా ఐసిసి టీమ్ ఇండియాకు ప్రత్యేకమైన బంతులు ఇస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అన్న విషయం తెలిసిందే.