షకీబ్ ను రాళ్లతో కొడతాం.. మాథ్యూస్ బ్రదర్ వార్నింగ్?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా అన్నింటిని తెగ చూసేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఒక వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి శ్రీలంక ఆల్రౌండర్ టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ చేరాల్సిన  పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.



 కాగా శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్రౌండర్ మాథ్యూస్  వచ్చి బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడని అందరూ అంచనా పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలోనే అతని హెల్మెట్ స్ట్రిప్ తెగిపోవడంతో మళ్లీ హెల్మెట్ మార్చుకోవడానికి వెళ్ళాడు. ఇక ఆ సమయంలో కాస్త లేట్ కావడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేయగా అబ్బాయిలు అతన్ని టైమ్డ్ ఔట్ గా ప్రకటించారు. దీంతో ఇది కాస్త వివాదంగానే మారిపోయింది అని చెప్పాలి. షకీబ్ క్రీడా స్ఫూర్తి కి విరుద్ధంగా ప్రవర్తించాడు అని కొంతమంది విమర్శలు చేస్తుంటే.. ఐసీసీ రూల్స్ ప్రకారమే అతను తెలివిగా వ్యవహరించాడు అని మరి కొంతమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.


 అయితే ఇదే విషయం గురించి మ్యాథ్యూస్ సోదరుడు స్పందిస్తూ ఏకంగా బంగ్లా కెప్టెన్ షకీబ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ షకీబ్ శ్రీలంక వస్తే రాళ్లతో సన్మానం చేస్తాం అంటూ మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ హెచ్చరించాడు. షకీబ్ క్రీడా స్ఫూర్తి మరచి వ్యవహరించాడు. అందుకు అతడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక అతన్ని లంక ఫ్యాన్స్ అంత త్వరగా మరిచిపోరు అంటూ ట్రెవిన్ పేర్కొన్నాడు. అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా  ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి టైమ్డ్ ఔట్ కావడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: