మాక్స్ వెల్ ఇన్నింగ్స్ పై.. కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతం జరిగింది. ఏకంగా పీకల్లోతు కష్టాల్లో కోరుకుపోయి ఓటమి ఖాయం అనుకున్న స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును గాయంతో బాధపడుతున్న మాక్స్వెల్ ఒంటరి పోరాటంతో గెలిపించాడు. ఒకవైపు కూడా కండరాలు పట్టేసి కనీసం నడవలేని స్థితిలో ఉన్న.. మధ్య మధ్యలో ఫిజియోలా హెల్ప్ తీసుకుంటూ చివరికి మ్యాచ్ ను ఫినిష్ చేసాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. కేవలం 128 బంతుల్లోనే 21 ఫోర్లు 10 సిక్సర్ల  సహాయంతో 21 పరుగులు చేశాడు. కంగారుల జట్టుకి విజయం అందించిన వీరుడిగా మారిపోయాడు.


 అయితే అతను మైదానంలో పోరాటం చేస్తున్న తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఫిదా చేసింది. అతడు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడుతూనే జట్టును గెలిపించాలి అనే పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో అతన్ని చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే మ్యాక్స్వెల్ సూపర్ ఇన్నింగ్స్ గురించి భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా మాక్స్వెల్ ను ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.



 నీవు మాత్రమే ఇలా చేయగలవు.. క్రేజీ ఇన్నింగ్స్ అని ఒక క్యాప్షన్ పెడుతూ మ్యాక్స్వెల్ ఫోటో ని షేర్ చేశాడు విరాట్ కోహ్లీ. కాగా ఇటీవల విరాట్ కోహ్లీ కూడా  సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు పుట్టినరోజు నాడే సెంచరీ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు అని చెప్పాలి. కాగా టీమిండియా తన తదుపరి మ్యాచ్ నవంబర్12వ తేదీన నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: