సెమీస్ లో.. భారత్ ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది?
ఆ తర్వాత ఏకంగా వరల్డ్ కప్ లో భాగంగా నాలుగవ స్థానం కోసం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంకను 25 ఓవర్ల లోపల లక్ష్యం చేదించి న్యూజిలాండ్ శ్రీలంకను ఓడించింది అంటే ఇక తప్పకుండా సెమి ఫైనల్ అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఇదే చేసి చూపించింది న్యూజిలాండ్. శ్రీలంక తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని 24 ఓవర్లు కూడా పూర్తికాకముందే చేదించింది.
అయితే ఇక ఇలా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గెలవడంతో పాటు సెమీఫైనల్కు బాగా దగ్గరయింది న్యూజిలాండ్ జట్టు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ కి నాలుగో స్థానం కోసం పోటీ ఇస్తున్న పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్లాలంటే అద్భుతమే జరగాలి. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్ 274 పరుగులు తేడాతో విజయం సాధించాల్సి ఉంది పాకిస్తాన్. ఒకవేళ ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ 2.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించాల్సి ఉంటుంది. ఈ రెండు అసాధ్యమే. దీంతో దాదాపు ఇక భారత జట్టు సెమి ఫైనల్లో తలబడబోయేది నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ తోనే అన్నది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.