సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర?

praveen
ప్రస్తుతం ఇండియా వేదిక జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ప్రేక్షకులందరికీ అంచనాలను ఎన్నో విషయాల్లో తారుమారు చేసింది అని చెప్పాలి. బాగా రాణిస్తాయి అనుకున్న జట్లు వరుస ఓటములు చవిచూస్తూ నిరాశ పరుస్తూ ఉంటే.. అద్భుత ప్రదర్శన చేసే రికార్డులు సృష్టిస్తారు అనుకున్న స్టార్ ప్లేయర్స్ చాలామంది చెత్త రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. అలాంటి సమయంలోనే ఇక మొదటిసారి వరల్డ్ కప్ లో ఛాన్సులు దక్కించుకున్న యంగ్ ప్లేయర్స్ మాత్రం అదరగొడుతున్నారు.


 ఇలా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ స్టార్ ప్లేయర్లకు సైతం షాక్ ఇస్తున్న యువ ఆటగాళ్లలో అటు న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర కూడా ఒకరు అని చెప్పాలి. భారత మూలాలు ఉన్న ఈ యంగ్ క్రికెటర్ బ్యాటింగ్ చూసి ఇక ఇండియన్ క్రికెట్ ప్రేక్షకుల సైతం ఫిదా అయిపోతున్నారు. అతను చిన్న పిల్లాడే.. వరల్డ్ కప్ లో రాణించాలి అంటే అతనికి చాలా అనుభవం కావాలి అనుకున్న వారి నోళ్లు మూయిస్తూ చిచ్చరపిడుగుల దూసుకుపోతున్నాడు. వరుస సెంచరీలు చేస్తూ అదరగొట్టేస్తూ ఉన్నాడు.


 అయితే ఇటీవలే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు  ఒక సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 1996లో ఒక వరల్డ్ కప్ లో సచిన్ 523 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 551  పరుగులు చేశాడు. శ్రీలంకతో మ్యాచ్లో ఈ రికార్డును బ్రేక్ చేశాడు  అలాగే తొలి వరల్డ్ కప్ లోనే అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్ గాను ఘనత సాధించాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్. 2019 వరల్డ్ కప్ లో బెయిర్ స్ట్రో 532 పరుగులు చేయగా.. ఇప్పుడు 551 పరుగులతో ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: