రిటైర్మెంట్ ప్రకటించిన.. టీమిండియా క్రికెటర్?

praveen
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు క్రికెట్ ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పటిలా క్రికెటర్లు కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవట్లేదు. దేశవాళీ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇక జాతీయ జట్టులోకి వచ్చేందుకు మంచి అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. అంతేకాదు ఇక భారత జట్టులో వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు.


ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ దృశ్యం ఎంతో మంది స్టార్ క్రికెటర్లకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా చాలామంది క్రికెటర్లు ఫిట్నెస్  కాపాడుకుంటూ ఫామ్ కొనసాగిస్తూ భారత జట్టులో కొనసాగుతుంటే.. కొంతమంది మాత్రం ఫామ్ కోల్పోయి ఇక జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వారు అవకాశాలు రాక తక్కువ వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు.


 కాగా ఇప్పుడు ఒక 33 ఏళ్ల టీమిండియా క్రికెటర్ కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా క్రికెటర్ గురు కీరత్ సింగ్ మాన్ క్రికెట్కు రిటర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పకు వచ్చాడు. 33 ఏళ్ల గురు కీరత్ సింగ్ భారత తరఫున కేవలం 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయితే ఐపీఎల్ లో పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, గుజరాత్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మొత్తం 44 మ్యాచ్లు ఆడిన గురు కిరత్ సింగ్ మాన్ 511 పరుగులు సాధించాడు. ఐదు వికెట్లు కూడా తీశాడు. అయితే ఈ ఆటగాడు రంజీ ఫార్మాట్లో అటు పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాడు. సరైన అవకాశాలు రాకపోవడంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: