టీమిండియా సక్సెస్ సీక్రెట్ అదే.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఇలా ఈ మహా టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచిన భారత్ సెమి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక ఇటీవలే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్ లాంటి చిన్న టీం తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది అని చెప్పాలి. ఏకంగా దీపావళి పండుగ నాడే 160 పరుగుల తేడాతో విజయం సాధించి ఫ్యాన్స్ అందరికీ కూడా ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమ్ ఇండియా సీక్రెట్ ఏంటి అన్న విషయాన్ని తెలిపాడు. వరల్డ్ కప్ ప్రారంభం నుంచి మేము ఒక్కో మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాం.
సుదీర్ఘ టోర్నీ కావడంతో అతిగా ఆలోచించాలని.. ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కో మ్యాచ్ పై ఫోకస్ చేసాం. దానిని బాగా ఆడటం మాకు చాలా ముఖ్యం. అందరూ ఇలాగే చేశారు. వేరువేరు పరిస్థితులు విభిన్న వేదికలపై సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించాం. దానికి అనుగుణంగానే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. ఇక ఇలా ఓటమి లేకుండా దూసుకుపోవడం సంతోషంగా ఉంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు బాధ్యత వహించి సమిష్టిగా జట్టు కోసం రాణించడం మంచి సంకేతం. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చక్కగా ఉంచడానికి మ్యాచ్ ఫలితాలు ఎంతో ముఖ్యమైనవి. ఇక మాపై భారీ అంచనాలు ఉండడం సహజం. వాటిని పక్కన పెట్టి ఆటపై దృష్టి పెడతాం. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లపై ఎలాంటి భారం లేకుండా ఉంటుంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.