భారత్ టాస్ గెలిస్తే? ఆకాష్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్లలో అన్నింట విజయం సాధించి అజయంగా నిలిచింది టీం ఇండియా. ఇక ప్రత్యర్థి  టీమ్స్ అన్నింటిని కూడా చిత్తుగా ఓడించి తమకు సొంత గడ్డపై తిరుగులేదు అన్న విషయాన్ని నిరూపించింది. అలాంటి టీమ్ ఇండియాకు ఇప్పుడు అసలు సిసలైన సవాలు ఎదురయింది అని చెప్పాలి. సెమీఫైనల్ లో భాగంగా టీమ్ ఇండియా కఠినమైన ప్రత్యర్థిగా కొనసాగుతున్న న్యూజిలాండ్తో నేడు మ్యాచ్ ఆడబోతుంది .


 ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత్ మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తుంది. 2019 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్లో ఎలా అయితే న్యూజిలాండ్ భారత్ ను ఓడించి కన్నీళ్ళను మిగిల్చిందో.. ఇక ఇప్పుడు భారత జట్టు కూడా న్యూజిలాండ్ అలాగే ఎదురుదెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎంతోమంది భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గురించి ఎంతోమంది మాజీలు కూడా తమ సూచనలను రివ్యూల రూపంలో ఇచ్చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గురించి ఇటీవల భారత మాజీ ఆటగాడు వ్యాఖ్యాత ఆకాశ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లలో భారత జట్టు టాస్ గెలిస్తే.. తొలత బ్యాటింగ్ ఎంచుకోవాలని ఆకాష్ చోప్రా సూచించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొండి. తర్వాత మంచు. ప్రభావం చూపించే అవకాశం ఉంది టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 300 వరకు పరుగులు చేస్తే మంచు.. రాకముందే మ్యాచ్ ముగించే సత్తా మన బౌలింగ్ దళానికి ఉంది అంటూ ఆకాష్ చోప్రా  చెప్పుకొచ్చాడు. కాగా ఈ వరల్డ్ కప్ టోర్నిలో ఇప్పటివరకు భారత బౌలింగ్ దళం ఇప్పటికే ఇది చేసి చూపించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: