టాస్ పెద్ద అంశం కాదు.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసులైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ప్రపంచ కప్ టోర్ని ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీఫైనల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సెమీఫైనల్ పోరులో భాగంగా న్యూజిలాండ్ టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న భారత్ ఎప్పుడూ న్యూజిలాండ్ చేతిలో మాత్రం గెలవడానికి చాలా కష్టపడి పోతూ ఉంటుంది. 2019 వరల్డ్ కప్ లో కూడా లీగ్ దశలో అద్భుతంగా రాణించిన భారత జట్టు సెమి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేడు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వరల్డ్ కప్ ప్రస్థానం చూసుకుంటే భారత జట్టు సొంత గడ్డపై వరుస విజయాలు సాధిస్తూ అజేయంగా ఉంది. అటు న్యూజిలాండ్ మాత్రం కాస్త పడుతూ లేస్తూ ప్రయాణం సాగించి అతి కష్టం మీద సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో భారత జట్టు విజయం సాధిస్తుందని అందరూ అంటుంటే.. గత గణాంకాలు మాత్రం న్యూజిలాండ్ దే పైచేయి అని చెప్పక్కనే చెబుతున్నాయి. అయితే న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.


 అయితే మ్యాచ్ జరుగుతున్న వాంకడే స్టేడియంలో టాస్ ఎంతో కీలక పాత్ర వహించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వాంకడే స్టేడియంలో నేను చాలా మ్యాచులు ఆడాను. ఇక్కడి పిచ్ పై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. టాస్ అనేది పెద్ద అంశం కాదు. గత నాలుగైదు మ్యాచ్ల ఫలితాలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న వంకడే స్టేడియం అటు రోహిత్ శర్మకు హోం గ్రౌండ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇదే గ్రౌండ్ నుంచి అటు రోహిత్ శర్మ క్రికెటర్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: