అప్పటికి నేను ఇంకా పుట్టనే లేదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఇక ఇప్పుడు మరోసారి 2023 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పడుతూ లేస్తూ ప్రస్తానాన్ని కొనసాగిస్తే.. భారత జట్టు మాత్రం వరుస విజయాలతో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇక న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్ నేపథ్యంలోఎన్నో ఆసక్తికర విషయాలు చర్చకు వస్తూ హాట్ టాపిక్గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. న్యూజిలాండ్తో జరగబోయే సెమీఫైనల్ కు మ్యాచ్ కు ముందు అటు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. ప్రస్తుతం టీమిండియాలోని ఒక్క ఆటగాడు కూడా పుట్టలేదు అంటూ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే రెండోసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సమయంలో జట్టులోని సగం మంది ఆటగాళ్లు కనీసం తమా కెరియర్ను కూడా ప్రారంభించలేదు అంటూ తెలిపాడు. గత విజయాలు ఓటముల గురించి తమ పట్టించుకోకుండా.. ప్రస్తుతం గురించి ఆలోచిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న బౌలర్లు బాగా రాణిస్తున్నారని. కానీ హార్దిక్ పాండ్యా గాయపడటం దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చాడు.