ధోని తర్వాత కెప్టెన్ అవుతాడనుకుంటే.. సీఎస్కే నుండి అతను ఔట్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా భారత్ వేదికగా జరుగుతున్న  వరల్డ్ కప్ టోర్నిని చూస్తూ తెగ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఇక మరో ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు  మాత్రం 2024 ఐపీఎల్ సీజన్ లో తమ జట్టును విజేతగా ఎలా నిలపాలి అనే విషయంపై ఇప్పటినుంచే ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టుకు భారం అనుకున్న ఆటగాళ్లను వదిలేయడం.. ఇక తమ అంచనా ప్రకారం జట్టును విజయతీరాలకు చేర్చుతాడు అని నమ్మకం ఉన్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం చేస్తూ ఉన్నాయి.


 అయితే డిసెంబర్ నెలలో 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మినీ వేలం కోసం ఆటగాళ్లు తమ జట్టు నుంచి ఉద్వాసన పలకాలి అనుకుంటున్న ప్లేయర్ల వివరాలను ప్రకటించాలి అంటూ బీసీసీఐ ఇప్పటికే ప్రకటన చేసింది  ఐపీఎల్ లో ఉన్న జట్ల యాజమాన్యాలు కూడా ఇలా జట్టుకు భారమైన ఆటగాళ్ళను వదిలేసేందుకు సిద్ధమై ఆ లిస్టును కూడా ప్రకటించాయి. అయితే భారీ ధర పెట్టి ధోని టీం చెన్నై కొన్న ఒక ఆటగాడిని ఇప్పుడు మళ్లీ వేలంలోకి వదిలేసింది ఆ ఫ్రాంచైజీ.


 జట్టు కెప్టెన్ ధోని కంటే ఎక్కువగా 16.25 కోట్లు పెట్టి.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని జట్టులోకి తీసుకుంది సీఎస్కే. కానీ అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేడు. దీంతో అతని వదులుకునేందుకు సిద్ధమైంది. మోకాలి చికిత్స నేపథ్యంలో 2024 సీజన్లో అతను అందుబాటులో ఉండకపోవచ్చు అన్న కారణంతో అతన్ని విడిచి పెట్టేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైందట. అయితే ఇలా భారీ ధరతో జట్టులోకి వచ్చిన స్టోక్స్ ఏకంగా ధోని తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అని అందరూ నమ్మారు  కానీ ఇప్పుడు అతను సడన్ గా సీఎస్కే నుండి అవుట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: