డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. రికార్డులు బద్దలు కొట్టిన సెమీఫైనల్?
అయితే ఒకప్పుడు ఇలా వరల్డ్ కప్ మ్యాచ్లను మొబైల్స్ లో వీక్షించాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయ్యేది. కానీ ఇప్పుడు అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వరల్డ్ కప్ లోని అన్ని మ్యాచ్లను కూడా ఉచితంగానే లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంది. దీంతో కోట్ల మంది ప్రేక్షకులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉపయోగిస్తూ ఎలాంటి సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించకుండానే ఉచితంగా మ్యాచ్ లను చూడగలుగుతున్నారు. అయితే ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అటు వ్యూయర్షిప్ రికార్డులు కూడా ప్రతి మ్యాచ్ లో కూడా బద్దలు అవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. గతంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 49వ వన్డే సెంచరీ చేశాడు.
ఆ సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వ్యూయర్షిప్ ఏకంగా 4.4 కోట్లకు వెళ్లి రికార్డ్ సృష్టించింది. వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో అయితే మరో రికార్డు బద్దలైంది అని చెప్పాలి. ఏకంగా వీకెండ్ లో మాత్రమే కాదు వర్కింగ్ డే లో కూడా హాట్ స్టార్ హిస్టరీలోనే అత్యధిక వ్యూస్ సంపాదించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి 5వ ఓవర్లను ఏకంగా ఐదు కోట్ల మంది వీక్షించారు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైం వ్యూవర్షిప్ రికార్డు నమోదయింది. కోహ్లీ 50వ సెంచరీని 4.6 కోట్ల మంది వీక్షించగా.. ఇక మ్యాచ్ చివరి 5వ ఓవర్లను ఏకంగా ఐదు కోట్ల మంది వీక్షించారు.