డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డ్.. సౌత్ ఆఫ్రికా నుండి ఒకే ఒక్కడు?

praveen
ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే సెమీఫైనల్ మ్యాచ్లు కూడా ముగిసాయి. మొదటి సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల జరిగిన రెండో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ను ఓడించిన ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరి టైటిల్ గెలిచే పోరు కోసం సిద్ధమైంది అని చెప్పాలి. అయితే లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్న సౌత్ ఆఫ్రికా అటు సెమి ఫైనల్ మ్యాచ్లో మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే.


 నాకౌట్ మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా ప్రదర్శన ఎక్కడ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఏకంగా అతి తక్కువ పరుగులకే కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కోరుకుపోయింది. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 212 పరుగులు చేసింది అని చెప్పాలి  ఇక ఈ టీం కి ఈమాత్రం అయినా గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది అంటే దానికి కారణం సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ అని చెప్పాలి  ఏకంగా నాకౌట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయినప్పటికీ డేవిడ్ మిల్లర్ మాత్రం ఏకంగా జట్టుకు పిల్లర్గా పరువు పోకుండా నిలబడ్డాడు.



 ఏకంగా అందరూ బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ స్కోర్కె వికెట్లు కోల్పోతూ పెవిలియన్  చేరుతున్న వేల.. అతను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక అతను ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు ఐదు సిక్సర్లు ఉండడం గమనార్హం. అయితే ఈ సెంచరీ ద్వారా జట్టు ఓడిపోయిన అతను మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అదే సమయంలో ఒక అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్లలో  సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌత్ ఆఫ్రికా ను తన సెంచరీ తో 212 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ అందించగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: