వరల్డ్ కప్ హిస్టరీ లో.. ఆస్ట్రేలియా ప్రయాణం ఎలా సాగిందంటే?
ఈ క్రమంలోనే ఫైనల్ చేరిన ఈ రెండు టీమ్స్ గురించి ఎన్నో పాత గణాంకాలు కూడా సోషల్ మీడియాలో తెరమీదికి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఈ విషయాలను తెలుసుకునేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఇక వరల్డ్ కప్ లో ఎలాంటి ప్రస్థానం కొనసాగింది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది ఆస్ట్రేలియా జట్టు.
అంతేకాదు వరుసగా నాలుగు వరల్డ్ కప్లలో చాంపియన్గా నిలిచిన ఏకైక జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. అయితే ఇలా వరల్డ్ కప్ హిస్టరీలో ఆస్ట్రేలియా ప్రస్థానం ఎలా కొనసాగిందో ఒకసారి చూసుకుంటే.. 1975లో జరిగిన మొదటి వన్డే వరల్డ్ కప్ లో రన్నర్ ఆఫ్ గా నిలిచింది ఆస్ట్రేలియా.. 1987లో ఛాంపియన్స్ గా అవతరించింది. 1996లో రన్నరప్ గా 1999లో ఛాంపియన్స్, 2003లో చాంపియన్స్, 2007లో ఛాంపియన్స్, 2017 లో ఛాంపియన్స్ గా నిలిచిన ఆసిస్.. 2019 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ నుండి నిష్క్రమించింది. ఇక ఇప్పుడు 2023లో ఫైనల్ కు చేరుకుంది. విజేతగా నిలుస్తుందా లేదా అన్నది నవంబర్ 19వ తేదీన తేలబోతుంది.