టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షం తప్పదు : ఆసిస్ కెప్టెన్
అయితే ఇటీవల సెమి ఫైనల్లో భాగంగా సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఇక రికార్డ్ స్థాయిలో ఎనిమిదోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే భారత్ తో పోల్చి చూస్తే వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన అనుభవం ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉంది. కానీ ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగించిన భారత్‌ను సొంత గడ్డమీద తక్కువ అంచనా వేశారు అంటే ఇక మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పాలి. కాగా భారత జట్టుతో జరగబోయే మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాడ్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మాలో కొద్దిమందికి ఇదివరకే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన అనుభవం ఉంది. కొంతమంది టి20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడారు. ఇక మరోసారి మా జట్టు ఫైనల్ వరకు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ అయితే మరింత. ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోతుంది. ఇక స్టేడియం కు వచ్చిన ప్రేక్షకులు అందరూ భారత్‌కు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు. అలాంటి వాతావరణం ఊహించుకుంటేనే గొప్ప అనుభూతి కలుగుతుంది అంటూ ప్యాడ్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.