వరల్డ్ కప్ : టీమిండియాలో.. ఏ రాష్ట్రం నుంచి ఏ ఆటగాడు ఉన్నాడంటే?

praveen
ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత గడ్డమీద పుష్కరకాలం తర్వాత జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఈసారి రోహిత్ సేన ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో సెమీఫైనల్ తో కలుపుకొని పది మ్యాచ్లు ఆడిన టీమిండియా.. అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించి పరాజయమే ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది.


 కాగా నేడు ఆస్ట్రేలియా తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో.. ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక అతిరథ మహారథిల మధ్య ఫైనల్ పోరు అంగరంగ వైభవంగా జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి విశ్వవిజేతగా నిలవబడే టీం ఏది అనేదానిపై అంతట ఉత్కంఠ ఉంది. ఈ రెండు టీమ్స్ కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉండడంతో ఇక ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోయే టీమిండియా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి.


 ప్రస్తుతం భారత జట్టులో ఉన్న 15 మంది సభ్యులు దేశంలోని ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ వివరాలు చూసుకుంటే..

 రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సూర్య కుమార్ యాదవ్, శార్దూల్ ఠాగూర్ మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు.

 రవీంద్ర జడేజా, బుమ్రా, హార్దిక్ పాండ్యా గుజరాత్ కు చెందిన క్రికెటర్లు.

 మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు ఉత్తరప్రదేశ్ కు చెందిన క్రికెటర్లు.

 కేఎల్ రాహుల్, ప్రసీద్ కృష్ణ కర్ణాటక కు చెందిన క్రికెటర్లు.


 విరాట్ కోహ్లీ ఢిల్లీకి చెందిన క్రికెటర్ కాగా.. తెలంగాణ నుంచి మహమ్మద్ సిరాజ్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. తమిళనాడు నుంచి అశ్విన్, పంజాబ్ నుంచి గిల్, బీహార్ నుంచి ఇషాన్ కిషన్ ప్రస్తుతం జట్టులో సభ్యులుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: