19 బంతుల్లో 65 పరుగులు.. మాజీ ప్లేయర్ ఊచ కోత?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది.  వరుస మ్యాచ్లలో విజయం సాధిస్తూ అదరగొడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక సెమి ఫైనల్ వరకు వరుసగా పది మ్యాచ్ లలో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. ఫైనల్లో అడుగుపెట్టింది.. ఫైనల్ లో  ఆస్ట్రేలియా తో తలబడుతుంది   అయితే ప్రస్తుతం భారత జట్టు జోరు చూస్తూ ఉంటే ఫైనల్ ఎట్టి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాని ఓడించి టైటిల్ విజేతగా నిలవడం ఖాయం అని తెలుస్తుంది.


 ఇక వరల్డ్ కప్ లో భాగంగా ఉత్కంఠ భరితమైన పోరుని చూస్తూ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అటు లెజెండ్స్ క్రికెట్ లీగ్ కూడా ఇటీవల ప్రారంభమైంది. దీంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీలు అందరూ మళ్ళీ మైదానంలోకి దిగి ఇక క్రికెట్ ఆడుతూ ఉండడంతో చూడడానికి క్రికెట్ ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే భారత మాజీ క్రికెటర్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తన బ్యాటింగ్లో ఉన్న పదును ఎక్కడ తగ్గలేదు అన్న విషయాన్ని నిరూపించాడు.



 ఇటీవల లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా తొలి మ్యాచ్లో ఇండియా క్యాపిటల్స్, బిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే బిల్వారా జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ ఇర్ఫాన్ పఠాన్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో 19 బంతుల్లోనే 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 65 పరుగులు చేశాడు ఈ మాజీ ఆటగాడు. దీంతో ఇక 229 పరుగుల లక్ష్యాన్ని బిల్వారా కింగ్స్ జట్టు కేవలం 19.2 ఓవర్లలోనే చేదించింది. అయితే ఈ మ్యాచ్లో తోలుతో బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ టీం కెప్టెన్ గా ఉన్న గౌతమ్ గంభీర్ 63 పరుగులతో రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: