ఫైనల్లో భారత్ ఓడిపోయిందని.. అతను చేసిన పనికి అందరూ షాక్?
చిన్న పెద్ద అనే తేడా లేదు. యావత్ భారత్ మొత్తం భారత జట్టు గెలవాలని దేవున్ని మొక్కుకున్నారు. కానీ ఎందుకో ఆ దేవుడి అనుగ్రహం దక్కలేదు. ఫైనల్ మ్యాచ్లో గెలుపు కోసం పోరాడిన టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో బాగా రానించిన టీమ్ ఇండియా ఫైనల్ లో మాత్రం ఒత్తిడి ముందు లొంగిపోయింది. చివరికి ఇక ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా ఈ బాధ నుంచి మాత్రం అస్సలు బయటపడలేకపోతున్నారు అభిమానులు.
ఈ క్రమంలోనే భారత్ మ్యాచ్ ఓడిపోవడంతో ఏకంగా ఆ బాధను తట్టుకోలేక.. ఒక అభిమాని గుండె ఆగిన వార్త అందరిని కలిసివేసింది. అయితే ఇటీవల ఏకంగా ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందని.. ఒక యువకుడు క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన అసోంలోని గువహటిలో వెలుగులోకి వచ్చింది. ఐటిఐ విద్యార్థి ప్రొంజల్ నిన్న కుటుంబీకులతో కలిసి మ్యాచ్ చూశాడు. అయితే ఇండియా ఓడిపోవడంతో బాధతో బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే కుటుంబీకులు వెళ్లి చూడగా ఇక ఉరివేసుకొని కనిపించాడు. కాగా విగత జీవిగా కనిపించిన కుమారుడిని చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. దారుణంగా విలపించారు. అయితే ప్రొంజల్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు తెలిపారు.