వరల్డ్ కప్ గెలిచి.. ఇండియా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన వార్నర్?
అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా కీలకపాత్ర వహించాడు. అయితే బ్యాట్స్మెన్ గా పెద్దగా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. కానీ అటు ఫీల్డర్ గా మాత్రం ఎన్నో పరుగులను కాపాడాడు అని చెప్పాలి. మైదానంలో పాదరసంలా కదులుతూ అతను ఫీల్డింగ్ చేసిన విధానం చూసి.. ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. అయితే డేవిడ్ వార్నర్ అటు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేక్షకుల కంటే భారత క్రికెట్ అభిమానులకే బాగా క్లోజ్. దీంతో వార్నర్ ని ఇండియన్ క్రికెటర్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు.
అలాంటి డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టును గెలిపించి ఇక భారత్కు టైటిల్ గెలవాలని కలను కలగానే మిగిల్చి వెళ్లిపోయాడు. దీంతో ఇదే విషయంపై ఒక నేటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. డియర్ డేవిడ్ వార్నర్.. నువ్వు కోట్లాదిమంది హృదయాలను ముక్కలు చేశావ్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే దీనికి డేవిడ్ వార్నర్స్ స్పందిస్తూ క్షమించమని కోరుతున్న.. అద్భుతమైన వాతావరణంలో గొప్ప మ్యాచ్ జరిగింది. భారత్ ఒక గొప్ప ఈవెంట్ నిర్వహించింది థాంక్యూ ఆల్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక డేవిడ్ వార్నర్ ఇచ్చిన రిప్లై కాస్త అభిమానులందరినీ కూడా ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి.