టీమిండియా కెప్టెన్సీ.. సంజూకి ఇవ్వాల్సింది?
అతని కంటే వెనకాల వచ్చిన ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ కీ అవకాశం ఇస్తున్న సేలెక్టర్లు అటు సంజు శాంసన్ విషయంలో మాత్రం నమ్మకం ఉంచడం లేదు అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో అటు రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ గా సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ బాగా రాణిస్తున్న భారత సెలక్టర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే అతని విషయంలో బీసీసిఐ వివక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ ఎంతో మంది అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కి కూడా అతనికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతని అభిమానులు అందరూ కూడా మరింత నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.
అయితే ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ కు సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై బిసిసిఐ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా వివరణ ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ నేత శశి తరుర్ ఒక పోస్ట్ పెట్టారు. సీనియర్ ప్లేయర్లు లేనప్పుడు సంజూని కెప్టెన్‌గా నియమించాల్సింది. అతను కేరళ స్టేట్ టీం తో పాటు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా కెప్టెన్ గా ఉన్నాడు సూర్య కుమార్ కంటే ఎక్కువ కెప్టెన్సీ అనుభవం సంజుకే ఉంది అలాగే చాహాల్ ను కూడా ఎందుకు ఎంపిక చేయలేదు అంటూ ప్రశ్నించాడు శశి థరూర్. ఇటీవలే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కోసం జట్టులో సూర్యకుమార్ కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్‌ని వైస్ కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.