రోహిత్ భవితవ్యం గురించి.. చర్చకు సిద్ధమైన బీసీసీఐ?

praveen
ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ సారథి బాధ్యతలు అందుకున్న తర్వాత భారత జట్టు మరింత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక టీమ్ ఇండియాను మూడు ఫార్మాట్లలో కూడా విజేతగా నిలబెట్టడంలో.. అటు రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఐసిసి ర్యాంకింగ్స్ లో కూడా ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది అని చెప్పాలి. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో కూడా టీం ఇండియా ఎంత మంచి ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 లీగ్ దశ నుంచి కూడా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా.. ఏకంగా సెమీఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అదరగొట్టింది  కానీ ఫైనల్ పోరులో మాత్రం తడబడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కెప్టెన్గా భారత జట్టుకి అటు వరల్డ్ కప్ టైటిల్ అందించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ కు ఫైనల్లో ఓడిపోవడంతో నిరాశ మిగిలింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ ముగిసిన నేపథ్యంలో అటు కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యం గురించి బీసీసీఐ అతనితో చర్చలు జరపడానికి సిద్ధమైంది అన్నది తెలుస్తోంది.


 అయితే వైట్ బాల్ కెప్టెన్ రోహిత్  భవితవ్యం ఏంటి అనే విషయంపై కూడా గత కొంతకాలం నుంచి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికే జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లలో రోహిత్ ఒకడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ వయస్సు 36 ఏళ్ళు. ఇక ఫిట్నెస్ సమస్యలతోనూ బాధపడుతున్నాడు. అన్ని మ్యాచ్లు ఆడలేక పోతున్నాడు. అయితే  ఇటీవల కాలంలో అన్ని టీమ్స్ కూడా అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో యంగ్ ప్లేయర్స్ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు t20 లకు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించే వైపుగా బీసీసీఐ అడుగులు వేస్తుంది. అయితే వన్డే ఫార్మాట్లో రోహిత్ భవితవ్యం గురించి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: