అతను ఆటే మొదలుపెట్టలేదు.. అలాంటి వాడికి కెప్టెన్సీనా : పాక్ మాజీ
కెప్టెన్గా బాబర్ అజాం తప్పుకోగా ఇక టి20 ఫార్మాట్ కెప్టెన్సీ ని షాహిన్ ఆఫ్రిదికి అప్పగించారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అటు షాన్ మసూద్ కు అప్పగిస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే కోచింగ్ సిబ్బంది చీఫ్ సెలెక్టర్ విషయంలో కూడా కొత్తవారిని నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కాగా టెస్ట్ కెప్టెన్సీ షాన్ మసూద్ కు అప్పగించడం పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మీయందాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాన్ మసూద్ కి కెప్టెన్సీ అప్పగించడం ముమ్మాటికి తప్పుడు నిర్ణయమే. ఇక కెప్టెన్సీ ఒత్తిడితో అతను ఆడటమే మర్చిపోతాడు అంటూ మీయాందాద్ కామెంట్ చేశాడు.
షాన్ మసూద్ స్థానంలో సర్పరాజు అహ్మద్ కు కెప్టెన్సీ అవకాశం కల్పించి ఉండవచ్చు. షాన్ మసూద్ ఇప్పటికీ కూడా సొంత క్రికెట్ ఆడటం స్టార్ట్ చేయలేదు. అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడమేంటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఇక అతని వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే షాన్ మసూద్ టెస్టు కెరియర్ అతను జట్టును నడిపించేంతగా లేదు. ఏకంగా ఇప్పటివరకు 30 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అతను 28.52 సాగటుతో టెస్టులు నాలుగు సెంచరీలు సాధించాడు. ఇక నిరంతరం పరుగులు చేయడంలో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు షాన్ మసూద్.