ఫైనల్లో.. ఆస్ట్రేలియా అందుకే బ్యాటింగ్ తీసుకోలేదట : అశ్విన్
అప్పటివరకు వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చిన టీమిండియా.. ఇక ఫైనల్ లో మాత్రం తడబడి చివరికి టైటిల్ చేర్చుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయ్. ఇక ఫైనల్ పోరుకు సంబంధించిన చర్చ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టుకు బాగా కలిసి వస్తుందని అభిమానులు బాగా సంతోషపడిపోయారు. కానీ ఊహించని ఫలితం వచ్చింది.
ఇక ఇదే విషయంపై టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకోవడానికి కారణాన్ని అశ్విన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బేయిలి తో తాను మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు. ముందుగా బ్యాటింగ్ ఎందుకు తీసుకోలేదని.. బేయిలిని నేను అడిగాను. తాము ఇదే మైదానంలో ఐపిఎల్ సహా ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాము. ఈ పిచ్ ముందుగా బౌలింగ్ కి తర్వాత బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది. ఇది గ్రహించే ఇక ఫైనల్ మ్యాచ్లో టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు బేయిలి తనతో చెప్పాడని అశ్విన్ తెలిపాడు.