రింకు సింగ్.. ది ఫినిషర్.. మరోసారి ప్రూవ్ చేశాడు?
దీంతో ఇలా మిడిల్ ఆర్డర్ సమస్య మళ్లీ భారత జట్టుకు మొదటికి వచ్చేస్తుంది. అయితే ఇలాంటి మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ సమస్య ఉంది కాబట్టే గతంలో ఐపీఎల్ లో బాగా రానించిన దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ బ్యాట్స్మెన్ ను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. కానీ అతను కూడా ఎక్కడ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. కానీ గత ఐపీఎల్ సీజర్ నుంచి ఒక యంగ్ ప్లేయర్ మాత్రం ఇక తానే టీమ్ ఇండియాకు ఫ్యూచర్ ఫినిషర్ అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఎంతో దూకుడైన బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.
ఏకంగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ఒకే ఒక ఇన్నింగ్స్ తో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్ రింగు సింగ్.. ఆ తర్వాత కూడా తన బ్యాటింగ్లో అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడిన మ్యాచ్లో కూడా అదే రీతిలో అదరగొట్టాడు ద ఫినిషర్ రింకు సింగ్. భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడిన సమయంలో క్రీజూలోకి వచ్చి 14 బంతుల్లో 22 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు బౌండరీలు ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ చూసి అతనే ఫ్యూచర్ ఫినిషర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.