సీఎస్కే జట్టుకు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ  కూడా క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక కేవలం భారత క్రికెటర్లు మాత్రమే కాదు తమ దేశానికి చెందిన స్టార్ ప్లేయర్లు కూడా ఐపీఎల్ లో భాగమతి ఉంటారు. దీంతో వారి ఆటను చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక టి20 ఫార్మాట్లో ఈ టోర్ని జరుగుతూ ఉండడంతో.. ప్రేక్షకులందరికీ కావలసిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ రికార్డులు అన్నీ కూడా ఈ టోర్నీలో కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 దీంతో ఇక ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ ని కూడా మిస్ చేయకుండా చూడడానికి అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచి సన్నాహాలను మొదలుపెట్టింది బీసీసీఐ. డిసెంబర్ నెలలో మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది. దుబాయ్  వేదికగా ఈ మినీ ఆక్షన్ జరుగుతుంది అని చెప్పాలి. ఏకంగా 590 మంది ఆటగాళ్లు ఇక ఈ వేలంలో పాల్గొనబోతున్నారు అన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. ఇక 2024 ఐపీఎల్ లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్.


 ఇలాంటి సమయంలోనే కొన్ని టీమ్స్ ని అటు ఆటగాళ్ల గాయాలు ఆందోళనలో పడేస్తున్నాయ్ అని చెప్పాలి. ఇక చెన్నై జట్టులో కాస్లీ ప్లేయర్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విషయంలో  ఆ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే స్టోక్స్ ఐపీఎల్ 2024 కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు. వర్క్ లోడ్ ఫిట్నెస్ కారణంగానే స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తెలిపింది. 32 ఏళ్ల ఈ స్టార్ ఆల్ రౌండర్ ఐపీఎల్ కంటే ముందు టీమిండియాతో ఐదు టెస్టులు ఐపీఎల్ తర్వాత టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. కాగా వేలంలో అతన్ని అటు చెన్నై 16.25 కోట్లకు సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: