ఆస్ట్రేలియాతో ఉత్కంఠ పోరు.. రింకు విన్నింగ్ షాట్ చూశారా?

praveen
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా అనే పంచ్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్తారింటికి దారేది సినిమాలో.. పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ చెప్పడంతో థియేటర్లు మొత్తం ప్రేక్షకుల విజిల్స్ తో మారుమోగిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్.. ఇక ఎన్నో సందర్భాలలో కూడా బాగా సరిపోతూ ఉంటుంది. ఇక క్రికెట్లో కూడా ఈ డైలాగ్ కొన్ని కొన్ని సార్లు బాగా సరిపోతుంది. చివరి బంతికి సిక్సర్ కొట్టి ఎవరైనా బ్యాట్స్మెన్ జట్టును గెలిపించాడు అంటే చాలు ఇక లాస్ట్ సిక్స్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అనే డైలాగ్ బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది.


 ఆస్ట్రేలియా, ఇండియా మధ్య విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా రింకు సింగ్ కి ఇలాంటి అనుభూతి లభించింది అని చెప్పాలి. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏకంగా 208 పరుగులు చేసింది. దీంతో 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది  టీమిండియా. అనుభవం లేని ఆటగాళ్లు ఎలా ఇంత పెద్ద టార్గెట్ చేదిస్తారో.. లేదో అని అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వీరోచితమైన పోరాటం చేసిన టీమిండియా అదరగొట్టింది. ఇక చివరిలో రింకు 17బంతుల్లో 22 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరికి రెండు బంతులు మెలిగి ఉన్నాయి అన్న సమయంలో అందరిలో ఉత్కంఠ ఉంది.


 ఇలాంటి సమయంలోనే రింకు సింగ్ ఏకంగా చివరి ఓవర్లో చివరి బంతిని సిక్సర్ గా మలిచాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. కానీ ఆ బంతిని అంపైర్ నోబాల్ గా ప్రకటించడంతో.. ఇక ఆరు పరుగులు టీమ్ ఇండియా ఖాతాలో చేరిపోయినప్పటికీ.. ఇక ఒక బంతి మిగిలి ఉండగానే టీం ఇండియాకు విజయం వరించింది అని చెప్పాలి. ఇలా చివరి బంతికి రింకు సింక్ కొట్టిన విన్నింగ్ షాట్ కి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి మైమరిచిపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: