ఒక ప్రధాని అలా చేయడం.. నేనైతే ఎప్పుడూ చూడలేదు : సెహ్వాగ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్ గెలుపుతో మంచి వీడ్కోలు లభిస్తుంది అని అభిమానులు అందరూ కూడా భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భారత అభిమానులందరికీ కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్నది మళ్ళీ కలగానే మిగిలిపోయింది. అయితే ఇలా ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా నిరాశలో ఉన్న సమయంలో.. ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి స్టేడియం కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి అటు ఆటగాళ్లు అందరికీ కూడా ధైర్యం చెప్పారు. బాధలో ఉన్న ప్లేయర్స్ అందరిని కూడా ఓదార్చారు.
ఇలా ఏకంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఆటగాళ్లను ఓదార్చడంపై ఎంతోమంది మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ కూడా మాట్లాడాడు. ఇలాంటివి తాను మునుపెన్నడూ చూడలేదు. నిరాశలో ఉన్న మన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు వారికి మద్దతుగా నిలిచేందుకు మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళడం మంచిపని. వచ్చే వరల్డ్ కప్ లో మరింత అద్భుతంగా ఆడేందుకు అది ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. మరి కొంతమంది మాజీలు కూడా ఇదే విషయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.