పిడుగు పగబడితే.. ఇంత దారుణంగా ఉంటుందా?
అయితే ఇక వర్షాలు పడినప్పుడు ఏదో ఒకసారి మాత్రమే పిడుగులు పడటం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎవరో దురదృష్టవంతులపై పిడుగులు పడుతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తిపై పగ పట్టినట్లుగా పిడుగులు పడతాయా అంటే.. అలా ఎందుకు జరుగుతుంది గురు.. పిడుగులు కూడా మనుషుల్లాగా ఏమైనా పగ పడతాయా.. అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం పిడుగులకు కూడా పగలు ప్రతీకారాలు ఉంటాయా అనే అనుమానం మీకు కూడా కలగక మానదు. ఎందుకంటే ఒక వ్యక్తిపై ఒక్కసారి పిడుగు పడింది అంటే అదేదో దురదృష్టం కొద్దీ జరిగి ఉంటుంది అని అనుకోవచ్చు.
కానీ ఇక్కడ మాత్రం పిడుగు పగ పట్టినట్లుగా ఒకే వ్యక్తిపై పడింది. బ్రిటిష్ ఆఫీసర్ అయిన వాల్టర్ సమ్మర్ ఫోర్డ్ పై ఏకంగా మూడు సార్లు పిడుగులు పడ్డాయి. 1918లో గుర్రంపై వెళ్తున్న సమయంలో అతను మొదటి సారి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ సమయంలో పక్షవాతం బారిన పడటంతో ఆయనను చివరికి ఆర్మీ నుంచి తొలగించారు. కొన్నేళ్ల తర్వాత చెరువు ఒడ్డున చేపలు పడుతున్న సమయంలో మరోసారి పిడుగు పడింది. ఆ సమయంలో పక్షపాతం పోయి మళ్ళీ నడవగలిగాడు..1930లో మరోసారి పిడుగు పడటంతో మంచానికి పరిమితమై చనిపోయారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని సమాధిపై కూడా పిడుగు పడింది.