ప్లేయర్స్ ని మార్చుకున్న.. SRH, RCB టీమ్స్?

praveen
ఐపీఎల్ మొదలైంది అంటే చాలు భారత్లో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. ప్రేక్షకులకు ఎలా అయితే క్రికెట్ నుంచి ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటారో.. అలాంటి ఎంటర్టైన్మెంట్ అటు ఐపీఎల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పొందగలుగుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రతి ఇంటా కూడా ఇలా క్రికెట్ పండుగ ఐపీఎల్ జరిగినన్ని రోజులు కొనసాగుతూనే ఉంటుంది. ఎంతో మంది ప్రేక్షకులు స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తూ.. ఇక కోట్ల మంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుని ప్రతి మ్యాచ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.


 అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇలా ఐపిఎల్ టోర్నీ వీక్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ఎంతో విజయవంతంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం సన్నాహాలు మొదలయ్యయ్. డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి అన్ని టీమ్స్ కూడా తమ జట్టు నుంచి వదిలేయబోయే ఆటగాళ్ల వివరాలను సమర్పించాయి. ఇక ఏ టీం ఎవరిని కొనుగోలు చేయబోతుంది. ఏ ఆటగాడు అత్యధిక ధర పలకబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ మాత్రం ఇతర జట్లతో సంప్రదింపులు జరిపి తమ జట్టులోని ఒక ప్లేయర్ ను ఇతర జట్టులోని మరో ప్లేయర్ తో మార్చుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు టీమ్స్ కూడా ఇలా ఆటగాళ్లను మార్చుకున్నాయి. మయాంక్ డాగర్ ను ఆర్సిబి, శాబాజ్ అహ్మద్ ను సన్రైజర్స్ తీసుకున్నాయ్. గత ఏడాది వేలంలో డాగర్ ను హైదరాబాద్ 1.8 కోట్లకు శాబాజ్ ను బెంగళూరు 2.4  కోట్లకు సొంతం చేసుకోగా.. ఇప్పుడు అదే ధరకు ఈ ఇరు జట్లు ఆటగాళ్లను మార్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: