అతను చేసిన పనికి.. నేను చాలా హర్ట్ అయ్యాను : షమి
ఇక ఇలా గెలుచుకున్న వరల్డ్ కప్ ట్రోఫీని ఎంతో గౌరవిస్తూ ఉంటారు క్రికెటర్లు. ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఆ వరల్డ్ కప్ టైటిల్ ఏకంగా దేవుడు ఇచ్చిన బహుమతి అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ మాత్రం వరల్డ్ కప్ ట్రోఫీని అగౌరపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ట్రోఫీ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో వరల్డ్ కప్ ట్రోఫీ పై రెండు కాళ్లు పెట్టి బీరు తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. వరల్డ్ కప్ ట్రోఫీ అంటే అంత చిన్న చూపు అయిపోయిందా అంటూ ఇక అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే.
ఇక ఎంతోమంది సోషల్ మీడియాలో మిచెల్ మార్ష్ ను తిట్టిపోశారు. ఇదే విషయంపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ స్పందించాడు. మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటో దిగిన విధానంపై మీ అభిప్రాయం ఏంటి అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. అది చూసి నేను బాగా హార్ట్ అయ్యాను. జట్లన్ని ఫైట్ చేసేది ఆ ట్రోఫీ కోసమే. దానిని ఏ ఆటగాడు అయినా తలపై మోయాలనుకుంటాడు. కానీ అంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీపై కాలు పెట్టడం నాకు బాధ కలిగించింది అంటూ వ్యాఖ్యానించాడు మహమ్మద్ షమి.