ORS తాగింది.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలను చూసిన తర్వాత మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని  విధంగానే మారిపోయింది అని చెప్పాలి. అయితే తల్లి కడుపులో నుంచి భూమ్మీదికి వచ్చిన తర్వాత ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనో.. లేదంటే ప్రమాదం ముంచుకు వస్తేనో ప్రాణాలు పోయేవి అని అందరూ నమ్మేవారు. లేదంటే వృద్ధాప్యంలో అందరి లాగానే ఇక ప్రాణాలు పోతాయి అని అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అనూహ్యమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే కొంతమంది విషయంలో విధి నిజంగానే పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుందేమో అని అనుమానం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనూహ్య ఘటనలు ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అప్పటికే తల్లిదండ్రులను దూరం చేసి ఆ యువతని అనాధగా మార్చింది విధి. అయినప్పటికీ ఇంకా ప్రతీకారం తీరలేదు అన్నట్లు ఆ యువతి విషయంలో పగబట్టినట్లు గానే వ్యవహరించింది విధి.

 దీంతో అనూహ్య రీతిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. మెదక్ కు చెందిన నాగమణి అనే 23 ఏళ్ల అనాధ యువతి.. హైదరాబాద్లోని యూసఫ్ గూడాలో స్టేట్ హోమ్ లో రెండేళ్ల క్రితం నుంచి ఆశ్రయం పొందుతుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్న సదరు యువతి రోజు ఇన్సులిన్ తీసుకుంటూ ఉండేది. ఇక ఇటీవల కడుపునొప్పి రావడంతో ఏం తిన్నావ్ అని సిబ్బంది అడగగా.. నాలుగు అరటి పండ్లు తిన్నాను అంటూ చెప్పడంతో  ఆమెకు ఓఆర్ఎస్ ఇచ్చారు. అయితే ఓఆర్ఎస్ తాగిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్న యువతీ చివరికి ప్రాణాలు కోల్పోయింది. కాగా స్టేట్ హోమ్ ఉద్యోగిని వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: