టైం వచ్చినప్పుడు చెక్ పెడతా.. సెలెక్టర్లకు అక్షర్ పటేల్ వార్నింగ్?
కొంతమంది సాఫ్ట్ గా తమ అసంతృప్తిని వ్యక్తపరిస్తే.. ఇంకొంతమంది మాత్రం కాస్త గట్టిగానే సెలెక్టర్ల తీరును ఎండగడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ జాబితాలో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా చేరిపోయాడు అన్నది తెలుస్తుంది. అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ కి దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకొని తన ఆట తీరుతో పరవాలేదు అనిపిస్తున్నాడు. ఇటీవల రాయ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.
ఏకంగా నాలుగు ఓవర్ల కోటాలో 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. దక్షిణాఫ్రికా టూర్లో టీమ్ ఇండియా ఆడబోయే టి20 సిరీస్ జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. వన్డే ఫార్మాట్లో అతనికి చోటు కల్పించిన సెలెక్టర్లు.. టి20ల నుంచి మాత్రం తప్పించారు. అయితే ఇక ఈ ఆల్ రౌండర్ సెలెక్టర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. మౌనమే అన్నిటికీ సమాధానం అని చెప్పిన అక్షర్ పటేల్ సమయం వచ్చినప్పుడు సెలెక్టర్లకు చెక్ పెడతా అంటూ బదులిచ్చాడు. ఈ క్రమంలోనే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉండగా.. అతనికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.