ఓటు కోసం ఇచ్చిన డబ్బే.. చివరికి ప్రాణం తీసింది?

praveen
ఇటీవల తెలంగాణలో ఎన్నికల హడావిడి ఎంత వాడి వేడిగా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అన్ని ప్రధాన పార్టీలు కూడా ఓటర్ మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారమ్ నిర్వహించారు. అయితే ప్రచారం ముగిసిన తర్వాత గల్లీ గల్లీలో ధనలక్ష్మి నాట్యం చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఓటర్లకు భారీగా డబ్బు పంచేందుకు వెనకాడ లేదు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒక్కో ప్రాంతంలో ఓటుకు ఇంత అంటూ లెక్కేసి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు ఓటర్లు.


 ఎందుకంటే అభ్యర్థులే తమ ప్రత్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకోండి కానీ మాకే ఓటు వేయండి అని చెబుతూ ఉండడంతో.. అందరూ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఎవరికి వేయాలో వారికే ఓటు వేయడం చేశారు ఓటర్లు. అయితే ఇలా ఎన్నికల్లో ఓటు కోసం ఇచ్చిన నోటే ఇక ఇక్కడ ప్రాణాలు పోవడానికి కారణమైంది అన్న వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఓటు కోసం ఇచ్చిన డబ్బులు ప్రాణాలు తీయడం ఏంటి.. అలా ఎందుకు జరుగుతుంది అంటారా.. ఓటు కోసం ఇచ్చిన డబ్బులే ఇక్కడ ఒక గొడవకు కారణమయ్యాయ్. చివరికి ప్రాణాలు పోవడానికి దారితీసింది.



 ఇలా ఓటు వేయాలని రాజకీయ పార్టీలు ఇచ్చిన డబ్బు ఓ కుటుంబంలో తీరని శోఖాన్ని నింపింది. తాండూరులోని కరన్ కోట శివారులో గ్రామానికి చెందిన యువకుడు నాపరాయి గనుల్లో పనిచేసేవాడు  అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన నగదు ఇవ్వమని భార్యను అడిగాడు. కానీ ఆమె నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువకుడు చివరికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరునాడు ఉదయం గమనించిన గ్రామస్తులు అతని ఆసుపత్రికి తరలించారు. అయితే అతని మృతి పై అనుమానాలు ఉండడంతో మృత దేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించేందుకు నిరాకరించారు వైద్యులు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వైద్యులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: