అసలైన ధోని వారసుడు అతనే : దీప్ దాస్

praveen
బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టీం ఏది అంటే చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో  ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ టీం గా అవతరించింది. ఏ టీం కి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని.. చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని అటు ఐపిఎల్ లో ఆడుతున్నాడు.

 దీంతో ఇక ప్రతి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లను చూస్తూ ధోని ఆట తీరును ఆస్వాదిస్తున్న అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీ వ్యూహాలతో జట్టును నడిపించే తీరు.. ప్రతి సీజన్లోని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అయితే ధోని త్వరలో ఐపీఎల్ కెరియర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని వారసుడిగా సారధ్య బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అనే ప్రశ్న గత కొంతకాలం నుంచి తెరమీదికి వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా ఎవరు ఊహించని విధంగా రిషబ్ పంత్ ధోని వారసుడు అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పంత్ నూ ధోని వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ తయారుచేస్తుంది అంటూ దీప్ దాస్ గుప్తా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ కి ధోని అంటే ఆరాధన అని.. మరో రెండేళ్లలో అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: