గెలిచింది ఎనిమిది సీట్లే అయినా.. బిజెపి సక్సెస్ అయ్యింది?
అయితే ఈ రెండు పార్టీల గురించి మాత్రమే కాదు ఈ అసెంబ్లీ ఎన్నికలలో 8 స్థానాలలో విజయం సాధించిన బిజెపి పార్టీ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటి బిజెపి గెలిచింది ఎనిమిది సీట్లే కదా అంతలా పెద్దగా చర్చించుకోవడానికి ఏముంటుంది అనుకుంటున్నారు కదా.. బీజేపీ సాధించింది 8 సీట్లే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే బిజెపి తెలంగాణలో డబుల్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అధికారాన్ని చేపట్టే అంత సీట్లను సాధించకపోయిన.. ప్రతిపక్ష హోదాను సంపాదించుకునేంత మెజారిటీ సీట్లు లేకపోయినా.. ఇక తమ ఓటు బ్యాంకు ను మాత్రం బిజెపి పెంచుకోవడంలో సక్సెస్ అయింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క గోషామహల్ స్థానానికి మాత్రమే పరిమితమైన బిజెపి.. ఈసారి మాత్రం 8 స్థానాలను సొంతం చేసుకుంది. అప్పట్లో ఆరు 6. 98 ఓటింగ్ శాతాన్ని సొంతం చేసుకుంటే.. ఇక ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు చేసుకుంది. అగ్ర నేతలు ఈటెల, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు గెలిచి ఉంటే ఇంకా కాస్త జోష్ ఉండేది. ఏది ఏమైనా 8 స్థానాలు సంపాదించినప్పటికీ ఇక ఫ్యూచర్లో తెలంగాణలో బిజెపి బలపడుతుంది అనే నమ్మకాన్ని కార్యకర్తల్లో కూడా కలిగించింది. భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో కెసిఆర్ రేవంత్ రెడ్డి లాంటి సీఎం అభ్యర్థుల మధ్య పోటీకి దిగిన బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయాన్ని అందుకోవడమైతే కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పాలి.