ధోని అభిమానులకు గుడ్ న్యూస్.. తలా ఈజ్ బ్యాక్?
అయితే ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఐపీఎల్లో మాత్రం ప్రతి ఏడాది తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రతి సీజన్ కి ముందు ఒక వార్త తెగ వైరల్ గా మారిపోతుంది. కానీ ధోనీ మాత్రం ఇలా వరుసగా ఐపిఎల్ సీజన్లలో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం కూడా మహేంద్రసింగ్ ధోని ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ధోని అభిమానులందరికీ కూడా ప్రస్తుతం ఒక గుడ్ న్యూస్ అందింది. 2024 ఐపీఎల్ సీజన్ కోసం ఫీట్ గా ఉండేందుకు ప్రస్తుతం ధోని జిమ్ లో చెమటోడుస్తున్నాడు. ఇక సీజన్లో బాగా రాణించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ధోని మోకాలి సర్జరీ చేయించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడానికి జిమ్ లో కసారతులు చేస్తున్నారు.