కోహ్లీ జీవితంలో.. ఆ రికార్డు బ్రేక్ చేయలేడు : లారా
ఈ క్రమంలోనే తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతో మంది లెజెండ్స్ రికార్డును బద్దలు కొడుతూ వచ్చాడు. అయితే చాలామంది మాజీ క్రికెటర్లు కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేయడంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఏకంగా 49 సెంచరీల రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలోనే అటు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డును కూడా బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి. అయితే సెంచరీల విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లలో ఎవరు కూడా కోహ్లీ రికార్డుకు చేరువలో కూడా లేరు అని చెప్పాలి.
ఇక ఇదే విషయం గురించి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ త్వరలోనే 100 సెంచరీల రికార్డును కూడా బద్దలు కొడతాడు అంటూ అభిమానులు అనుకుంటున్న వేల ఇలాంటి సమయంలో లారా మాత్రం అది అంత సులువు కాదు అంటూ చెబుతున్నాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 80 సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డుకు చేరువ కావాలంటే మరో 20 సెంచరీలు చేయాలి ఏడాదికి ఐదు సెంచరీలు అనుకున్న 100 సెంచరీలు చేరడానికి నాలుగేళ్ల సమయం పడుతుంది. అప్పటికి విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. అందుకే సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం అంటూ బ్రియాన్ లారా కామెంట్ చేశాడు.