కోతి కరిచినప్పటి నుండి.. రింకు ఇలా చేస్తున్నాడు : గిల్
ఈ క్రమంలోనే చివర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడి మేటి ఫినిషర్‌గా గుర్తింపును సంపాదించుకుంటున్నాడు రింకు సింగ్. ఇటీవలే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో అతను ఎంతలా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నాడో అందరం చూసాము. అయితే బ్యాటింగ్‌లో భారీ షాట్లు కొట్టడమే కాదు ఫీల్డింగ్ లోను పాదరసంలా కదులుతూ అదరగొడుతున్నాడు. ఏకంగా మైదానంలో అతను వేగంగా పరిగెత్తుతున్న తీరు.. అందరిని ఫిదా చేస్తుంది. ఇదే విషయంపై టీమిండియా ఓపెనర్ గిల్ మాత్రం ఆసక్తికర కామెంట్ చేశాడు కోతి కరవడం వల్లే రింకు వేగంగా పరిగెత్తుతున్నాడు అంటూ సరదాగా గిల్ పేర్కొన్నాడు.
టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ లో ఉంది. ఈ క్రమంలోనే తొలి 20 కి ముందు ఫిట్నెస్ తదితర విషయాలను బిసిసిఐ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రింకు సింగ్. ఈ సమయంలో మైదానంలో రింకు మాట్లాడుతుండగా.. వెనకాల నుంచి వచ్చిన గిల్.. రింకు ఫిట్నెస్ పై సరదాగా కామెంట్ చేశాడు. ఏకంగా రింకు సింగ్ ని కోతి కరిచిన నాటి నుంచి కూడా ఇలా వేగంగా పరిగెత్తుతున్నాడు అంటూ సరదాగా కామెంట్ చేసి నవ్వులు పూయించాడు. ఇక ఈ కామెంట్‌తో అటు రింకు సింగ్ కూడా తెగ నవ్వుకున్నాడు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో అదరగొట్టిన రింకు ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో బౌన్సి పిచ్ లపై ఎలా రాణించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.