పాపం ఇంగ్లాండ్.. 25 ఏళ్ల తర్వాత ఆ టీమ్ చేతిలో ఓటమి?
మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఎంత దారుణంగా విఫలం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో ఒకటిగా ఉన్న ఇంగ్లాండ్ ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పసికూన టీమ్స్ సైతం విజయాల సాధిస్తే.. ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు మాత్రం వరుస ఓవటములతో పాయింట్లు పట్టికలో చివరన కొనసాగింది.
కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలపై విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండు జట్టుకు.. మరో షాక్ తగిలింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ జట్టుపై వెస్టిండీస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి 269 రన్స్ చేసింది. అనంతరం వెస్టిండీస్ లక్ష్యాన్ని అలవోకగా చేదించి విజయాలు సాధించి సిరీస్ ను దక్కించుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు మరో ఊహించని షాక్ తప్పలేదు అని చెప్పాలి.