వారెవ్వా.. సౌత్ ఆఫ్రికాలోను రింకు మేనియా?
కానీ ఊహించని రీతిలో రింకు అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అదే రీతి విధ్వంశాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎంతో అలవోకగా బంతిని బౌండరీకీ తరలిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. ఈ ఆటగాడు ఇక మొన్నటికి మొన్న సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికాలో ఉండే బౌన్సీ పిచ్ లపై ఈ నయా ఫినిషర్ ఆట తీరు ఎలా ఉంటుందో అనిఅందరూ అనుకున్నారు. అయితే ఎలాంటి పిచ్ పై అయితే ఏంటి అతని విధ్వంసానికి అటు అదుపు ఉండదు అన్న విషయాన్ని మరోసారి రింకు సింగ్ నిరూపించాడు.
సౌత్ ఆఫ్రికాలో బౌన్సి పిచ్ లపై కూడా భారత యువ బ్యాటింగ్ సంచలనం రింకు సింగ్ మేనియా కొనసాగుతుంది. ఇటీవల సఫారీ జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో రింకు సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ తో చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గ్రీజులోకి వచ్చిన రింకు సింగ్ ఆచితూచి ఆడుతూ వీలైనప్పుడల్లా బౌలర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 174.36 స్ట్రైక్ రేటుతో 39 బంతుల్లో 68 పరుగులు చేసాడు రింకు సింగ్. ఇక ఇటీవల కాలంలో ప్రతి మ్యాచ్ లో కూడా నిలకడగా రాణిస్తున్న అతనిపై విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.