అలా చేశాడని.. యువకుడిపై యాసీడ్ పోసిన యువతి?
అయితే ఇలా అమ్మాయిలపై అబ్బాయిలు దాడి చేయడం దారుణంగా ప్రవర్తించడం లాంటిది మొన్నటి వరకు ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా మారిపోయారు. ఏకంగా పెళ్లికి ఒప్పుకోకపోతే, ప్రేమను అంగీకరించకపోతే ఏకంగా అబ్బాయిల పైన సైతం దాడి చేస్తూ ఉన్న అమ్మాయిలను చాలామందిని చూస్తూ ఉన్నామ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా పెళ్లికి అంగీకరించలేదు అన్న కారణంతో ఒక యువకుడి పై యువతి యాసిడ్ పోసింది. ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. బీహార్ లోని వైశాలి జిల్లాలో వెలుగు చూసింది ఈ దారుణ ఘటన.
తనతో పెళ్లికి ఒప్పుకోలేదు అన్న కారణంతో 22 ఏళ్ళ యువకుడి పై 24 ఏళ్ల యువతి యాసిడ్ పోసి దాడి చేసింది. దీంతో యువకుడి ముఖం మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కాగా బాధితుడు ధర్మేంద్ర కుమార్ గా పోలీసులు గుర్తించగా అతనికి ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక ఇలా దాడి చేసిన యువకుడు అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. అయితే ఆ ఇద్దరికీ కూడా ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు.